: తొంభై శాతం మంది భారతీయులు మోడీని వ్యతిరేకిస్తున్నారు: జావెద్ అక్తర్
బీజేపీ ప్రధాని అభ్యర్ధి నరేంద్ర మోడీపై రాజ్యసభ సభ్యుడు, ప్రముఖ బాలీవుడ్ గీత రచయిత జావెద్ అక్తర్ మాటల తూటాలు పేల్చారు. ప్రధాని పదవికి పోటీ చేస్తున్న మోడీని తొంభై శాతం మంది భారతీయులు వ్యతిరేకిస్తున్నారని అన్నారు. మోడీని వ్యతిరేకించడమంటే జాతిని వ్యతిరేకించడమేనని కొంతమంది మూర్ఖులు అంటున్నారని... అంటే 90 శాతం మంది భారతీయులు జాతి వ్యతిరేకులే కదా అని ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. గత నెలలో పాట్నాలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న జావెద్ ఇలాగే మోడీపై విమర్శలు చేశారు. దేశానికి ఆయన మంచి ప్రధాని కాలేరని అన్నారు.