: ఎన్టీఆర్ ఇంటివద్ద హడావిడి చేసిన దుండగుడి కోసం గాలింపు


జూనియర్ ఎన్టీఆర్ ఇంటి సమీపంలో దీపావళి రాత్రి దోపిడీకి యత్నించిన నిందితుడి కోసం పోలీసుల అన్వేషణ ఇంకా కొనసాగుతూనే ఉంది. జూబ్లీహిల్స్ రోడ్ నెం.28లో దీపావళి రాత్రి 10.30కి ఒక వ్యక్తి నంబర్‌ ప్లేట్ లేని బైక్‌పై వచ్చి జూనియర్ ఎన్టీఆర్ ఇంటి ఎదురుగా ఉన్న ఇంటి ఆవరణలోకి ప్రవేశించాడు. ఆ ఇంటి వాచ్‌మన్ భార్య లక్ష్మిని, గదిలోకి నెట్టి బయట గడియపెట్టాడు. తలుపు తీయాలని, లేకపోతే కాల్చేసానని ఆ ఇంటి యజమాని సందీప్ ను తలుపు అద్దాల్లోంచి పిస్టల్ గురిపెట్టి బెదిరించాడు. వారు తీయకపోవడంతో వెళ్లిపోయాడు. దీనిపై సందీప్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎదురుగా ఉన్న ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఇంటి సీసీ కెమెరా ఫుటేజ్‌లను పరిశీలించిన అనంతరం నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

  • Loading...

More Telugu News