: బ్యాటింగ్ కు దిగిన సచిన్


మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తన 199వ టెస్టు మ్యాచ్ లో బ్యాటింగ్ కు దిగాడు. ఈడెన్ గార్డెన్స్ లో విండీస్ తో జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ లో... నిన్న వికెట్లేమీ నష్టపోకుండా 37 పరుగులు చేసిన భారత్, ఈ రోజు ప్రారంభంలోనే తడబడింది. ఓపనర్లు శిఖర్ ధావన్ (23), మురళీ విజయ్ (26) లు పెవిలియన్ చేరారు. రెండు వికెట్లను కూడా షిల్లింగ్ ఫోర్డ్ తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం సచిన్, పుజారా క్రీజులో ఉన్నారు. సచిన్ 7 బంతుల్లో ఒక ఫోర్ తో 5 పరుగులు చేశాడు.

  • Loading...

More Telugu News