: రంగారెడ్డి జిల్లాలో గుర్తు తెలియని మహిళ దారుణ హత్య
రంగారెడ్డి జిల్లా కుల్కచర్ల మండలం బండవెలిచర్ల గ్రామంలో గుర్తు తెలియని మహిళను దారుణంగా హత్య చేసి దహనం చేశారు. ఈ ఘటన ఈ రోజు వేకువజామున జరిగింది. బండివెలికిచర్ల గ్రామ సమీపంలోని సెల్ టవర్ దగ్గర మంటలు వస్తుండగా గమనించిన స్థానికులు అక్కడికి వెళ్లి చూడగా మహిళ మృతదేహం దగ్ధమవుతోంది. అప్పటికే కాళ్లు, చేతులు మినహా మృతదేహం మొత్తం కాలి బూడిదయ్యింది. మృతదేహాన్ని గోనెసంచిలో కట్టి తెచ్చినట్టు తెలుస్తోంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.