: ప్రాణాలు కాపాడిన బీరు!
బీరు తాగితే ప్రాణాలు నిలుస్తాయా... అంటే మ్యాట్ స్టికిల్స్ విషయంలో బీరే అతని ప్రాణాలను కాపాడింది. సముద్ర తీరంలో ఇద్దరు స్నేహితులు పొరబాటున సముద్రంలో పడిపోయారు. వీరిలో ఒకరిని అలలు వెనక్కి నెట్టేశాయి. మరోవ్యక్తి మ్యాట్ మాత్రం సముద్రంలో కొట్టుకుపోయాడు. చివరికి అతడిని కూడా కోస్ట్ గార్డులు లైఫ్‌రింగ్ వేసి రక్షించారు. అయితే గడ్డ కట్టించే సముద్రపు నీటిలో సుమారు 45 నిముషాల పాటు ఉండడం వల్ల అతను సృహ కోల్పోయాడు.
ఇంత చలిలో అంతసేపు గడిపినా మ్యాట్ స్టికిల్స్ ప్రాణాపాయం నుండి తప్పించుకున్నాడు. అతనికి వైద్యం చేసిన వైద్యులు సముద్రంలో పడిపోకముందు అతను తాగిన బీరే అతని ప్రాణాలను కాపాడిందని చెబుతున్నారు. సముద్రంలో పడిపోకముందు మ్యాట్ ఎనిమిది క్యాన్ల బీరును తాగాడని, దానివల్లే అతను ప్రాణాలతో ఉన్నాడని, అతని శరీరంలోని బీరు శరీర పనితీరును మందగించేలా చేయడం వల్లనే అంత చల్లటి నీటిలో అంతసేపు ఉన్నా కూడా అతను ప్రాణాలతో ఉన్నాడని వైద్యులు చెబుతున్నారు.