: సెలవు ఎరుగని శవధీరుడు


ఏ ఉద్యోగికైనా తమకు కేటాయించిన సెలవులను వాడుకోవడం అనేది సాధారణం. ఎవరికి కేటాయించిన సాధారణ సెలవులను వారు వాడుకుంటుంటారు. అయితే గోవింద్‌ వల్లభ్‌ పంత్‌ మాత్రం తన సెలవులను వాడుకోకుండా నిరంతరాయంగా పనిచేస్తూ రికార్డు సృష్టించాడు.

ఇండోర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రిలో మార్చురీ వైద్యుడు గోవింద్‌ వల్లభ్‌ పంత్‌ ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా రోజూ బుద్దిమంతుడైన పిల్లాడికి మల్లే హాస్పిటల్‌కు వచ్చి తన డ్యూటీని చేస్తూ రికార్డు సృష్టించాడు. 2006 నవంబరు నుండి ఆయన ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా నిరంతరాయంగా పనిచేసి 5,600 శవపరీక్షలను చేశారు. ఇన్ని రోజులూ వ్యక్తిగత సెలవులను వాడుకోకపోవడమే కాకుండా ఆదివారాలు, ప్రభుత్వ సెలవు దినాల్లో కూడా ఆయన పనిచేసి రికార్డు సృష్టించారు. ఈయన పనిపట్ల చూపిస్తున్న 'అంకిత' భావాన్ని గుర్తించి 2011లోనే లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డ్సు వారు గోవింద్‌ పేరును, ఆయన ఘనతను రికార్డు బుక్‌లో నమోదు చేశారట.

  • Loading...

More Telugu News