: జున్నుపాలు మనల్ని ఇలా కూడా రక్షిస్తాయట!


దూడలకు జన్మనిచ్చిన రెండురోజుల్లోగా ఆవులు, గేదెలు ఇచ్చే పాలను జున్నుపాలు అంటారు. ఈ పాలను తాగించడం వల్ల దూడలకు మంచి బలం వస్తుందనేది చాలామందికి తెలిసిందే. అదేపాలను మనం తాగితే కూడా మనకు పలు రకాలుగా రక్షణనిస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ముఖ్యంగా రోజు రోజుకూ పెరిగిపోతున్న కాలుష్య భూతం నుండి జున్నుపాలు మనకు రక్షణనిస్తాయని భావించిన శాస్త్రవేత్తలు ఈ దిశగా పరిశోధనలు సాగిస్తున్నారు.

దూడలకు జన్మనిచ్చిన 48 గంటల్లోగా ఆవుల నుండి సేకరించిన ముర్రుపాలలో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఈ పాలు వాయుకాలుష్యం నుండి రక్షణ కల్పించే అవకాశాలపై స్కాట్లాండ్‌కు చెందిన శాస్త్రవేత్తలు పరిశోధనలు సాగిస్తున్నారు. ఈ పాలల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు అథ్లెట్ల సామర్ధ్యం పెంచడానికి, డయేరియా వంటివి రాకుండా తోడ్పడతాయని ఇదివరకే నిర్వహించిన పరిశోధనల్లో తేలింది.

ఇప్పుడు వాయు కాలుష్యం అధికంగా ఉండే రియో నగరంలో జరిగే 2016 ఒలింపిక్స్‌లో పాల్గొననున్న అథ్లెట్లకు ఈ ముర్రుపాలు ఇవ్వాలని పరిశోధకులు భావిస్తున్నారు. ఈ పోటీల్లో పాల్గొననున్న అథ్లెట్లకు రెండు వారాలపాటు వరుసగా ముర్రుపాలు తాగించి పరిశోధనలు చేయనున్నట్టు అధ్యయనానికి నేతృత్వం వహిస్తున్న ఎలిసా గోమ్స్‌ చెబుతున్నారు. ఈ అధ్యయనానికి సంబంధించిన ఫలితాలు వచ్చే ఏడాది ఆరంభంలో తెలిసే అవకాశాలున్నాయి.

  • Loading...

More Telugu News