: పాకశాస్త్ర ప్రవీణురాలు తరళా దలాల్ కన్నుమూత
పాకశాస్త్ర ప్రవీణురాలిగా ఎందరో అభిమానులను సంపాదించుకున్న సెలెబ్రిటీ షెఫ్ తరళా దలాల్ గుండె పోటుతో మృతి చెందారు. ఈ ఉదయం 7 గంటల సమయంలో గుండెపోటు రావడంతో ఆమె కన్ను మూశారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమె వయస్సు 77 ఏళ్లు. వంటల గురించి ఆమె వందకు పైగా పుస్తకాలు రాశారు. 2007లో భారత ప్రభుత్వం ఆమెను పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. ప్రపంచ వ్యాప్తంగా ప్రజాదరణ పొందుతున్న మాస్టర్ షెఫ్ కార్యక్రమం కన్నా ముందే, టీవీ ఛానెళ్లలో తరళా దలాల్ షో పేరిట వంటల కార్యక్రమాన్ని ఆమె నిర్వహించారు.