: షాకుల మీద షాకులిస్తున్న బెంగాల్ క్రికెట్ అసోసియేషన్


బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అత్యుత్సాహంతో సచిన్ అభిమానులకు షాకుల మీద షాకులిస్తోంది. ప్రతిష్ఠాత్మక ఈడెన్ గార్డెన్స్ లో సచిన్ 119వ మ్యాచ్ సందర్భంగా బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ సంతోషం పట్టలేకపోతోంది. సచిన్ పేరును హోర్డింగ్ పై తప్పుగా రాసి కూల్ కెప్టెన్ ధోనీ ఆగ్రహాన్ని చవి చూసిన బీసీఎ, తాజాగా మరో తప్పు చేసింది.

మ్యాచ్ భోజన విరామ సమయంలో సచిన్ భార్య అంజలి కుటుంబ సమేతంగా ప్రెసిడెంట్ బాక్స్ లోకి వచ్చింది. ఆమెకు స్వాగతం చెబుతూ ఎలక్ట్రానిక్ స్కోరు బోర్డు మీద 'వెల్ కం టు మిస్టర్ అంజలి టెండూల్కర్' అని రాయించింది. అంతే స్టేడియంలోని అభిమానులు ఒక్కసారిగా షాకయ్యారు. సచిన్ స్టేడియంలో ఉండగా వెల్ కం ఏంటా? అని. ఇంతలో తప్పు తెలుసుకున్న బీసీఎ అధికారులు... చేసిన తప్పును సరిదిద్దుకున్నారు.

  • Loading...

More Telugu News