: ఈ నెల 9న ప్రధానితో భేటీ కానున్న సీఎం
ఈ నెల 9న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ తో భేటీ కానున్నారు. ఇటీవల రాష్ట్రంలో కురిసిన వర్షాలు, పంటనష్టం, ఇతర అంశాలపై ప్రధానికి సీఎం నివేదిక ఇవ్వనున్నారు. నష్టపోయిన వారికి సాయం చేయాలని కేంద్రాన్ని కోరనున్నారు. ఢిల్లీలో ఎల్లుండి (8వ తేదీన) కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించనున్న నేపథ్యంలో కిరణ్ ఢిల్లీ వెళుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన ప్రధానిని కలుస్తారు.