: తెలంగాణపై తీర్మానం రాకపోవచ్చు : బొత్స
తనకు తెలిసినంత వరకు అసెంబ్లీకి విభజన బిల్లు మాత్రమే వస్తుందని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అన్నారు. అయితే, తెలంగాణ అంశంపై తీర్మానం కూడా కావాలని తాము కాంగ్రెస్ అధిష్ఠానాన్ని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. పీసీసీ అధ్యక్షుడిగా సీడబ్ల్యూసీ నిర్ణయాన్ని అంగీకరిస్తున్నానని... కానీ, తమ ప్రాంత ప్రజల మనోభావాల మేరకు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతున్నామని చెప్పారు.