: తొలి ఇన్నింగ్స్ ను ధాటిగా ఆరంభించిన భారత్
ఈడెన్ గార్డెన్స్ లో విండీస్ తో జరుగుతున్న టెస్టు మ్యాచ్ లో భారత్ తన తొలి ఇన్నింగ్స్ ను ధాటిగా ఆరంభించింది. శిఖర్ ధావన్, మురళీ విజయ్ ఓపెనర్లుగా వచ్చారు. ఐదు ఓవర్లు ముగిసే సరికి భారత్ వికెట్లేమీ కోల్పోకుండా 25 పరుగులు చేసింది. ధావన్ 10 బంతుల్లో 3 ఫోర్లతో 14 పరుగులు చేశాడు. విజయ్ 14 బంతుల్లో 2 ఫోర్లతో 11 పరుగులు చేశాడు. అంతకు ముందు విండీస్ తొలి ఇన్నింగ్స్ లో 234 పరుగులకు ఆలౌట్ అయింది.