: ఆశారాంపై ఛార్జ్ షీటు దాఖలు చేసిన పోలీసులు
లైంగిక దాడి కేసులో వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపుపై పోలీసులు జోథ్ పూర్ కోర్టులో మరో ఛార్జ్ షీటు దాఖలు చేశారు. ఇందులో ఆశారాంతో పాటు మరో నలుగురి పేర్లను పేర్కొన్నారు. పదహారేళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డారంటూ వచ్చిన ఆరోపణలతో అరెస్టైన ఆశారాం గత రెండు నెలల నుంచి రిమాండ్ లో ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ ను కోర్టు పలుమార్లు తిరస్కరించింది.