: వెనిజులా అధ్యక్షుడు హ్యూగో చావెజ్ కన్నుమూత


వెనిజులా అధ్యక్షుడు హ్యూగో చావెజ్ కన్నుమూశారు. గత కొంతకాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్న ఆయన క్యూబాలోని కారకస్ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. 58 ఏళ్ల చావెజ్ కు 2011లో క్యాన్సర్ ఉన్నట్టు గుర్తించిన వైద్యులు నాలుగుసార్లు శస్త్రచికిత్స చేశారు.

అయినా ఆరోగ్యం కుదుటపడలేదు. అప్పటినుంచి ఆసుపత్రిలోనే  కీమోథెరపీ చికిత్స తీసుకుంటున్నారు. శరీరంలో కొత్త ఇన్ ఫెక్షన్ కారణంగా చావెజ్ ఆరోగ్యం మరింత క్షీణించింది. దీంతో మరోసారి ఆపరేషన్ చేసినా వ్యాధి నయమయ్యే అవకాశాలు లేవని వైద్యులు చెప్పిన మేరకు మంగళవారం చావెజ్ ఆరోగ్యంపై ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది.

దీంతో ఇన్ ఫెక్షన్ మరింత తీవ్రమవడంతో చావెజ్ మంగళవారం సాయంత్రం మరణించారు. జులై 28, 1954లో బారినస్ రాష్ట్రం సబనెటాలో చావేజ్ జన్మించారు.1998లో తొలిసారి వెనిజులా అధ్యక్షుడిగా ఎన్నికైన చావెజ్ 1999లో పదవీ బాధ్యతలు చేపట్టారు. అనంతరం 14 ఏళ్ల పాటు వెనిజులాను పాలించారు. ఆయనకు ఇద్దరు భార్యలు, నలుగురు పిల్లలు ఉన్నారు. 

  • Loading...

More Telugu News