: మొదలైన ఇంటర్ పరీక్షలు
రాష్ట్ర వ్యాప్తంగా నేడు ఇంటర్ పరీక్షలు ప్రారంభం అయ్యాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. విద్యార్థులు పరీక్ష హాలు వద్దకు 15 నిమిషాల కంటే ఆలస్యంగా వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని అధికారులు స్పష్టం చేశారు. ఈ ఏడాది పరీక్ష నిర్వహణకు గాను 2633 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇక, నేడు జరిగే ఇంటర్ ప్రథమ సంవత్సరం సెకండ్ లాంగ్వేజి పరీక్షకు సెట్-3 ప్రశ్నాపత్రాన్ని ఎంపిక చేశారు.