: దిగ్విజయ్ చేతిలో రాష్ట్రాన్ని పెట్టి సర్వనాశనం చేశారు: టీడీపీ


రాష్ట్ర విభజనకు దారి తీసిన కారణాలు, అనుసరిస్తున్న విధానాలపై టీడీపీ నేత సోమిరెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ చేతిలో రాష్ట్రాన్ని పెట్టి సర్వనాశనం చేశారని కాంగ్రెస్ అధిష్ఠానంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధికోసం చంద్రబాబు నిధులు అడిగితే లెక్కలు తెలియవన్న దిగ్విజయ్, కేసీఆర్ ప్యాకేజీ అడిగితే ఎందుకు మాట్లాడలేదన్నారు. రాష్ట్ర విభజనలో టీడీపీ భాగస్వామ్యం బాధాకరమని.. అయితే, పార్టీ అధ్యక్షుడిగా చంద్రబాబు తెలంగాణపై ఇచ్చిన లేఖకు కట్టుబడి ఉన్నామన్నారు.

ప్రస్తుత పరిస్థితులతో సమాంతరంగా మరో రాజధానిని ఏర్పాటు చేసుకోకుండా దిక్కులేని పరిస్థితి తీసుకొచ్చారని వ్యాఖ్యానించారు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ ఉత్తర, దక్షిణ జిల్లాల అభివృద్ధిలో తేడాలు రావా? అని ప్రశ్నించిన సోమిరెడ్డి... హైదరాబాదు నుంచి విడిపోయిన కర్ణాటక, మహారాష్ట్ర జిల్లాలు బాగున్నాయా? అని నిలదీశారు. 1969 లేదా 1972లో రాష్ట్రాన్ని విభజించి ఉంటే రాష్ట్ర పరిస్థితి ఇలా ఉండేది కాదని ఆవేదన వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News