: విండీస్ ను బొల్తా కొట్టించిన షమి.. విండీస్ 172/6


తొలి టెస్టులో నిలకడగా ఆడుతున్న విండీస్ ను లోకల్ బాయ్ మహ్మద్ షమి బోల్తా కొట్టించాడు. స్వంత మైదానంలో పంజా విసిరిన షమి ధాటికి విండీస్ 172 పరుగులకే 6 కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. టెయిలెండర్ల అండతో చందర్ పాల్ పోరాడుతున్నాడు. ముగ్గురు టాప్ ఆర్డర్ బ్యాట్స్ మెన్లను బౌల్డ్ చేసిన షమి, ఓ రన్ అవుట్ లో కూడా పాలు పంచుకున్నాడు. షమికి ఓజా, భువనేశ్వర్ కుమార్ చక్కటి సహకారమందించి చెరో వికెట్ తీశారు. దీంతో వెస్టిండీస్ 52 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 172 పరుగులు సాధించింది.

  • Loading...

More Telugu News