: సీఎం కిరణ్ పై మంత్రి సి.రామచంద్రయ్య ప్రశంసలు


ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై మంత్రి సి.రామచంద్రయ్య ప్రశంసల వర్షం కురిపించారు. సమైక్యవాదాన్ని సీఎం భుజాన వేసుకుని పోరాడుతున్నారన్నారు. ఈ విషయంలో ఆయన చిత్తశుద్ధిని అనుమానించవద్దని సూచించారు. సీఎం పదవికి ముప్పు వచ్చినా సమైక్యవాదాన్ని ఆయన వీడరన్నారు. రాయల తెలంగాణకు తాము వ్యతిరేకమన్న రామచంద్రయ్య జీవో ప్రకారం రాయలసీమకు 300 టీఎంసీల నీరు ఇవ్వాలని చెప్పారు.

  • Loading...

More Telugu News