: వైఎస్సార్సీపీ నేత అంబటి రాంబాబు అరెస్టు


గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలం కొండమోడి కూడలిలో వైఎస్సార్సీపీ రాస్తారోకో నిర్వహించింది. ఈ నేపథ్యంలో, ఆందోళనకు నాయకత్వం వహించిన వైసీపీ నేత అంబటి రాంబాబును పోలీసులు అరెస్టు చేశారు. వైసీపీ చేపట్టిన రాష్ట్ర వ్యాప్త రహదారుల దిగ్బంధం కార్యక్రమంలో భాగంగా... ఇక్కడి రహదారిపై వైసీపీ కార్యకర్తలు చేస్తున్న నిరసనను పోలీసులు అడ్డుకున్నారు. దాంతో, అంబటి, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. వెంటనే అంబటిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, ఆయన్ను పిడుగురాళ్ల పోలీస్ స్టేషన్ కు తరలించారు.

  • Loading...

More Telugu News