: మరోసారి వడ్డీ రేట్లు పెంచిన ఎస్ బీఐ
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్ బీఐ) మరోసారి వడ్డీ రేట్లను పెంచింది. బేస్ రేటును 0.2 నుంచి 1.0 శాతం మేర పెంచినట్లు వెల్లడించింది. పెంచిన రేట్లు నేటి నుంచే అమల్లోకి రానున్నాయి. దాంతో.. గృహ, వాహన రుణాలు, ఈఎమ్ఐలు మరింత పెరగనున్నాయి. అంతేగాక ప్రధాన రుణ రేటు బెంచ్ మార్క్ 0.20 నుంచి 14.75 శాతం పెరుగుతుందని తెలిపింది.