: కాశ్మీర్ పై అమెరికా ఆఫర్ ను వద్దనుకున్న పాక్
కాశ్మీర్ విషయంలో అమెరికా జోక్యం చేసుకోవాలని పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఇటీవల బహిరంగంగా డిమాండ్ చేసి, అదే విషయాన్ని బరాక్ ఒబామా ముందు ప్రస్తావించి కంగుతిన్న సంగతి తెలిసిందే. ముంబై దాడుల దోషులను పట్టుకోవడం ఎంతవరకు వచ్చిందని ఒబామా షరీఫ్ ను నిలదీశారు. అయితే, అదే అమెరికా ఆఫర్ ను పాకిస్థాన్ 2009లో కాదనుకుందట. కాశ్మీర్ విషయంలో చర్చల దిశగా భారత్ ను నడిపిస్తానని, అంతకు ముందు పాక్ లష్కరే తోయిబా, తాలిబాన్ వంటి ఉగ్రవాద సంస్థలకు సహకారం నిలిపివేయాలని ఒబామా షరతు పెట్టారు. కానీ, ఇందుకు పాక్ ఒప్పుకోలేదట. ఈ విషయాన్ని అమెరికాలో పాక్ మాజీ రాయబారి హుస్సేన్ హక్కానీ తన 'అద్భుత మాయ' అనే పుస్తకంలో పేర్కొన్నారు.