: వాన్ పిక్ కేసులో విజయసాయిని ప్రశ్నిస్తున్న ఈడీ
జగన్ అక్రమాస్తుల కేసులో ఆడిటర్ విజయసాయిరెడ్డిని ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. వాన్ పిక్ వ్యవహారంలో రెండో నిందితుడిగా ఉన్న విజయసాయి... ఈ రోజు ఢిల్లీలో ఈడీ ముందు హాజరయ్యారు. వైఎస్ సీఎంగా ఉన్న రోజుల్లో వాన్ పిక్ కు... అక్రమంగా భూములను కేటాయించారన్న విషయంపై ఈడీ విజయసాయిని ప్రశ్నిస్తోంది. ఇదే కేసులో విజయసాయి అక్టోబరు 31న, ఈ నెల 1వ తేదీన కూడా ఈడీ ఎదుట హాజరయ్యారు. ఈ రోజు హాజరవడం మొత్తం మీద మూడోసారి.