: బాలికపై అత్యాచారానికి యత్నించిన జవాన్లకు రిమాండ్


సికింద్రాబాద్ లోని మహేంద్ర హిల్స్ సాయిబాబా గుడి నుంచి ఇంటికి వెళ్తున్న బాలికపై అత్యాచారానికి ప్రయత్నించిన ముగ్గురు జవాన్లను రిమాండ్ కు తరలించారు. ఆదివారం రాత్రి స్నేహితుడితో కలసి గుడికి వెళ్లి వస్తున్న బాలికపై ముగ్గురు జవాన్లు లాక్ బహదూర్ శెట్టి (28), తపస్ మెహతి (29), సులాన్ నర్జర్ నారి (29)లు అత్యాచారం చేయడానికి ప్రయత్నించిన సంగతి తెలిసిందే. కేసు నమోదు చేసుకున్న పోలీసులు... ముగ్గురు జవాన్లను కోర్టుకు తరలించగా... న్యాయమూర్తి వారిని రిమాండ్ కు తరలించాలని ఆదేశించారు. కోర్టు ఆదేశాల మేరకు వారిని చర్లపల్లి జైలుకు తరలించారు.

  • Loading...

More Telugu News