: శ్రీవారిని దర్శించుకున్న ఇస్రో ఛైర్మన్ రాధాకృష్ణన్


తిరుమల శ్రీవారిని ఇస్రో ఛైర్మన్ రాధాకృష్ణన్ దర్శించుకున్నారు. నిన్న మధ్యాహ్నం 2 గంటల 38 నిమిషాలకు ప్రయోగించిన పీఎస్ఎల్వీ సి-25 విజయవంతం కావటంతో శ్రీవారికి మొక్కు చెల్లించుకున్నారు. ఈ రోజు వేకువజామున సుప్రభాత సేవలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న అనంతరం రంగనాయకుల మండపంలో రాధాకృష్ణన్ దంపతులకు అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వచనం పలికి శేషవస్త్రంతో సత్కరించారు. ఆలయ జేఈవో శ్రీనివాసరాజు స్వామివారి తీర్ధ ప్రసాదాలను అందజేశారు.

  • Loading...

More Telugu News