: 'పదహారేళ్ల వయసు'కు కేంద్రం ప్రతిపాదన
ఇద్దరి మధ్య పరస్పర అంగీకార శృంగారానికి కనీస వయసును 16 ఏళ్లకు తగ్గించాలని కేంద్రప్రభుత్వం ప్రతిపాదిస్తోంది. ఇన్నాళ్ళూ ఈ కనీస వయసు 18 ఏళ్లుగా వుంది. కొత్త క్రిమినల్ లా సవరణ బిల్లులో కేంద్రం ఈ ప్రతిపాదన చేసింది.
అలాగే, ఇన్నాళ్ళూ వాడుకలో వున్న 'లైంగిక అత్యాచారం' అనే పదానికి బదులుగా 'అత్యాచారం' అనే పదాన్ని మాత్రమే ప్రయోగించాలని కేంద్రం ప్రతిపాదించింది. ఈ కొత్త బిల్లుపై కేంద్ర మంత్రివర్గం తన తదుపరి సమావేశంలో చర్చిస్తుందని అధికార వర్గాలు తెలిపాయి.