: అమ్మాయిల చేతుల్లోనే ఎక్కువగా ఇవి ఉంటున్నాయి


స్మార్ట్‌ ఫోన్‌... ఈ ఫోన్‌లు అబ్బాయిలకన్నా అమ్మాయిల చేతుల్లోనే ఎక్కువగా ఉంటున్నాయట. ఇటీవల స్మార్ట్‌ ఫోన్‌ల వినియోగంపై జరిపిన ఒక సర్వేలో ఈ విషయం తేలింది. మొబైల్‌ డివైజ్‌పై 60 శాతం మంది ఆసక్తి చూపిస్తుండగా, స్మార్ట్‌ఫోన్‌లను ఇష్టపడుతున్న పురుషులు కేవలం 43 శాతం మంది మాత్రమే ఉన్నారట. ఈ సర్వేలో మొత్తం 1200 మంది మగువల అభిప్రాయాలను సేకరించగా వారిలో 87 శాతం మంది హ్యాండ్‌సెట్‌కు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నారని తేలింది.

సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్స్‌లో మేసేజ్‌లు పంపడానికి కూడా మహిళలు స్మార్ట్‌ఫోన్‌లను ఎక్కువగా వాడుతున్నారని ఈ అధ్యయనంలో తేలింది. ఫోటోలు తీయడం, వాటిని సేవ్‌ చేయడంలో కూడా మహిళలే ఎక్కువగా స్మార్ట్‌ఫోన్‌లపై ఆధారపడుతున్నారని ఈ సర్వేలో తేలింది.

  • Loading...

More Telugu News