: వెర్రి వేయివిధాలు... అందులో ఇది ఒకటి!


వెర్రి వేయివిధాలు... కానీ ఇలాంటి వెర్రి ఉంటుందా? అనేది మనకు ఎప్పటికప్పుడు కొన్నింటిని చూస్తుంటే సందేహం కలుగుతుంటుంది. అలాంటి వెర్రి ఉన్న వాళ్లని చూస్తుంటే అవునని అనాలనిపిస్తుంది. గిన్నిస్‌ బుక్‌లో చోటు సంపాదించడానికి చాలామంది చాలా రకాలుగా ప్రయత్నిస్తుంటారు. అందులో కాస్త వెరైటీ ప్రయత్నించాలని భావించిన ఒక వ్యక్తి ఇనుపబూట్లను ధరించి నడుస్తూ గిన్నిస్‌ బుక్‌లో చోటుకోసం చూస్తున్నాడు.

చైనాలోని హేబీ ప్రావిన్స్‌లోని ఫెంగాన్‌ జిల్లాకు చెందిన జాంగ్‌ పుక్సింగ్‌ గిన్నిస్‌ బుక్‌లో చోటు కోసం ఆరాటపడుతూ ఇందుకోసం ప్రత్యేకంగా బూట్లను తయారుచేయించుకున్నాడు. అవి మామూలు బూట్లు కావు. ఇనుప బూట్లు. అదికూడా తన బరువుకన్నా ఏడు రెట్లు ఎక్కువ బరువున్న బూట్లు. 405 కిలోల బరువున్న ఇనుప బూట్లను ధరించి రోజూ కొన్ని మీటర్ల దూరం నడుస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్న పుక్సింగ్‌ రోజుకు ఇరవై నిముషాల పాటు ఈ నడకను సాధన చేస్తున్నాడు.

త్వరలోనే దీన్ని గురించి గిన్నిస్‌ బుక్‌ వారికి దరఖాస్తు చేసుకుంటానని చెబుతున్నాడు. 30 సెం.మీ.ల పొడవుతో, 20 సెం.మీ.ల వెడల్పుతో ఉన్న బూట్లను ఇందుకోసం ప్రత్యేకంగా తయారుచేశారు. బూటు అడుగు భాగాన్ని 40 సెం.మీ.ల ఇనుప భాగాలతో వెల్డింగ్‌ చేసి అతికించారు. మొత్తానికి జాంగ్‌ పుక్సింగ్‌ గిన్నిస్‌ రికార్డుకోసం వెరైటీగా ప్రయత్నిస్తున్నాడు.

  • Loading...

More Telugu News