: సచిన్ కూతురు.. నా కొడుకు ఒకే రోజు ఆసుపత్రిలో జన్మించారు: ఒమర్ అబ్దుల్లా


సచిన్ తో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తెలిపారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ తన కుమారుడు, సచిన్ కుమార్తె ఒకే రోజు ముంబైలోని ఆసుపత్రిలో జన్మించారని అన్నారు. తామిద్దరం ప్రక్క ప్రక్క రూముల్లోనే ఉన్నట్టు చెప్పారు. మరోసారి తాను విదేశాంగ సహాయ మంత్రిగా ఉండగా దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లానని, అప్పుడు టెస్టులు ఆడేందుకు సచిన్ ఆక్కడున్నాడని, సౌతాఫ్రికా రాయబారి ఇచ్చిన విందులో తాము మళ్లీ కలుసుకున్నామని, ప్రక్క ప్రక్కనే కూర్చుని విందు చేశామని ఒమర్ గుర్తు చేసుకున్నారు.

సచిన్ లాంటి ఆటగాడు లేని లోటు ఎవరూ తీర్చలేరని ఆయన అన్నారు. భారత్ గెలిచినా సచిన్ లేని లోటు కన్పిస్తుందని ఒమర్ అబ్దుల్లా అభిప్రాయపడ్డారు. సచిన్ రిటైర్మెంట్ తనతో పాటు 120 కోట్ల భారతావనిని బాధకు గురి చేసిందని ఆయన అన్నారు.

  • Loading...

More Telugu News