: వైఎస్ అక్రమార్జనతో కోటిమందికి ఇళ్లు కట్టించవచ్చు: బాబు
కృష్ణా జిల్లాలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు పాదయాత్ర కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఆయన గుడివాడ వద్ద ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. అవినీతి కారణంగానే విద్యుత్ కోతలు పెరిగిపోయాయని విమర్శించారు. కరెంటు లేకపోతే నీళ్లు ఎలా వస్తాయంటూ ప్రశ్నించారు.
ఇక, వైఎస్ కుటుంబం అక్రమార్జనతో కోటి మందకి ఉచితంగా ఇళ్లు నిర్మించవచ్చని చెప్పారు. తాము అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్ర ఆదాయం రూ. 8000 వేల కోట్లు ఉండేదని వెల్లడించారు. ఇప్పుడు రాష్ట్రం రూ. లక్ష యాభై వేల కోట్ల రుణభారంతో సతమతమవుతోందని తెలిపారు.