: సచిన్ పేరు తప్పుగా పడినందుకు ధోనీ ఆగ్రహం
ఎప్పుడూ కూల్ గా ఉండే కెప్టెన్ ధోనీకి కోపమొచ్చింది. అంతేకాకుండా, కోపానికి కారకులైన వారిని ప్రెస్ మీట్ లోనే కడిగి పారేశాడు. ధోనీకి ఇంతగా కోపం రావడానికి పెద్ద కారణమే ఉంది. సచిన్ 199వ టెస్టు మ్యాచ్ కు వేదికైన ఈడెన్ గార్డెన్ లో హైకోర్టు ఎండ్ లో ఉన్న స్కోర్ బోర్డుపై సచిన్ పేరు తప్పుగా పడింది. బోర్డుపై SACHINకు బదులు SACHINE అని పడింది. ధోనీకి కోపం రావడానికి ఇదే కారణం. అనంతరం, బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో... ధోనీ స్కోర్ బోర్డువైపు చేయి చూపిస్తూ... ఈ తప్పు చేసిందెవరో చెప్పాలని మండిపడ్డాడు.