: 152 మంది సైనికులకు మరణశిక్ష విధించిన బంగ్లాదేశ్ కోర్టు
నాలుగు సంవత్సరాల కిందట జరిగిన నరమేధం కేసులో బంగ్లాదేశ్ లోని ఓ కోర్టు తీర్పును వెలువరించింది. మొత్తం 150 మంది తిరుగుబాటు సైనికులను దోషులుగా నిర్ధారించిన కోర్టు వారందరికీ మరణశిక్ష విధించింది. 2009లో దేశ సరిహద్దు వద్ద 74 మంది సామాన్య పౌరులను, 57 మంది మిలిటరీ కమాండ్స్ ను ఘోరంగా చంపిన కేసులో కోర్టు ఈ శిక్ష విధించింది. మొత్తం ఈ కేసులో 846 మంది ఆరోపణలు ఎదుర్కొన్నారు. మరో 251 మందికి మూడు నుంచి పది సంవత్సరాల శిక్ష విధించింది. కాగా 242 మందికి ఈ కేసులో ఎలాంటి సంబంధం లేదని చెప్పింది.