: కీలక మావోయిస్టు అరెస్ట్
మోస్ట్ వాంటెడ్ మావోయిస్టును ఒడిశా పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టుబడ్డ మావోయిస్టు జాదు తడింగ్ గా గుర్తించారు. ఇతడు 12 హత్యలతోపాటు మరెన్నో కేసుల్లో నిందితుడిగా ఉన్నాడని పోలీసులు తెలిపారు. ఇంటెలిజెన్స్ సమాచారం ఆధారంగా ఇతడిని కోరాపుట్ జిల్లా నారాయణపట్నం సమీపంలోని దుమ్సి గ్రామ అడవుల్లో పట్టుకున్నారు.