: విద్యార్థినిని గర్భవతిని చేసిన గురువు


విద్యాబుద్ధులు చెప్పి ఆదర్శవంతంగా తీర్చి దిద్దాల్సిన గురువే ఓ బాలిక పాలిట కీచకుడిగా మారాడు. టీచర్ పట్ల విద్యార్థుల్లో ఉండే సహజ ఆసక్తిని... తనకు అనుకూలంగా మలచుకున్న కీచక గురువు ఓ విద్యార్థినిని గర్భవతిని చేశాడు. ఈ ఘటన నల్గొండ జిల్లా చిలుకూరు మండలంలోని రామాపురంలో జరిగింది. గ్రామంలోని స్కూల్ లో ఓ టీచర్ పదో తరగతి చదువుతున్న విద్యార్థినిని గర్భవతిని చేసి, ఆ గర్భం తీయించేందుకు ప్రయత్నించాడు. విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాలు పాఠశాల ఎదుట ఆందోళన చేయడంతో డీఈవో కలుగజేసుకుని కీచక గురువును సస్పెండ్ చేశారు. బాలికకు న్యాయం చేయాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.

  • Loading...

More Telugu News