: న్యూజెర్సీలోని షాపింగ్ మాల్ లో కాల్పులు
అమెరికాలో మరో ఉన్మాది రెచ్చిపోయాడు. న్యూజెర్సీలోని వెస్ట్ ఫీల్డ్ గ్రాండ్ స్టేట్ ప్లాజా మాల్ లో సోమవారం రాత్రి స్థానిక కాలమానం ప్రకారం 9.20 నిమిషాలకు అగంతకుడు చొరబడ్డాడు. లోపల కాల్పులకు దిగాడు. షాపు మూసి వేయడానికి కొంచెం ముందుగా ఇది జరిగింది. ఆ సమయంలో మాల్ లో తక్కువ మంది ఉన్నట్లు సమాచారం. ఎవరికీ ఏ ప్రమాదం కాలేదని తెలుస్తోంది. వెంటనే పోలీసులు, ఎఫ్ బీఐ బృందాలు మాల్ వద్ద కు చేరుకున్నాయి. నిందితుడి కోసం వేట ప్రారంభించాయి. అయితే, మేయర్ పారామస్ మాత్రం అగంతకుడు మాల్ వదిలి పారిపోయి ఉంటాడని అభిప్రాయపడ్డారు.