: బస్ భవన్ ను ముట్టడించిన బీజేపీ
బస్ ఛార్జీల పెంపును నిరసిస్తూ డాక్టర్ కె.లక్ష్మణ్ ఆధ్వర్యంలో బీజేపీ నేతలు, కార్యకర్తలు హైదరాబాద్ లోని బస్ భవన్ ను ముట్టడించారు. అనంతరం రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టి, ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. పెంచిన ఛార్జీలను వెంటనే ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేశారు.