: ధరలపై సీపీఎం పోరుబాట
పన్నుల వడ్డింపు, అధిక ధరలు, నగదు బదిలీ రద్దు, సంక్షేమ పథకాల అమలులో ప్రభుత్వ వైఫల్యం, ప్రజా వ్యతిరేక విధానాలపై నిరసనగా సీపీఎం విజయవాడలో పోరుబాట ప్రారంభించింది. ధరలను నియంత్రించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ సీపీఎం నేతలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. త్వరలో జరగనున్న రచ్చబండలో ప్రభుత్వ అలసత్వాన్ని నిలదీయాలని... అందుకోసం ప్రజానీకాన్ని సిద్ధం చేసేందుకు పోరుబాటలో భాగంగా, అజిత్ సింగ్ నగర్ లోని లూనా సెంటర్ నుంచి పాదయాత్ర చేపట్టారు. ధరల భారానికి నిరసనగా మహిళలు వంట గ్యాస్ సిలిండర్లను మోసి తమ నిరసన తెలిపారు.