: నడి రోడ్డుపై యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తి అరెస్టు
కోల్ కతా సిటీ జాదవ్ పూర్ లోని గాంధీ కాలనీలో గత రాత్రి ఓ యువతి తన స్నేహితుడితో పాటు రోడ్డుపై నిల్చుంది. అంతలో రుద్రనారాయణ శర్మ అనే వ్యక్తి ఆమె వద్దకు వచ్చి నడి రోడ్డు పైనే అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమె మిత్రుడు అడ్డుకున్నప్పటికీ అతనిపై దాడి చేసి మరీ ఆమెను ఇబ్బంది పెట్టాడు. దీంతో ఆ యువతి అతనిపై ఫిర్యాదు చేసింది. నిందితుడికి సంబంధించిన గుర్తులను ఆమె పోలీసులకు తెలిపింది. దీంతో ఈ తెల్లవారు జామున గాంధీ కాలనీలో రుద్రనారాయణ శర్మను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.