: కడప రసాయన కర్మాగారంలో అగ్నిప్రమాదం
కడప పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర రసాయన కర్మాగారంలో ఈ ఉదయం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో నలుగురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వారిని రిమ్స్ కు తరలించారు. కర్మాగారంలో టైర్లను కాలుస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.