: 'బాలీవుడ్ బెంగాలీ కథానాయికల'ను సత్కరించనున్న పశ్చిమ బెంగాల్ సర్కార్


ఎక్కడెక్కడో పుట్టి బాలీవుడ్ ను ఏలుతున్న నటీమణులు ఎందరెందరో ఉన్నారు. వారిలో పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చిన కథానాయికలూ వున్నారు. వెస్ట్ బెంగాల్లో పుట్టి అనంతర కాలంలో హిందీ చిత్ర రంగంలో టాప్ హీరోయిన్లుగా వెలుగొందుతున్న ఐదుగురు కథానాయికలను సత్కరించాలని ఆ రాష్ట్ర సర్కార్ నిర్ణయించింది. ఈ క్రమంలో మౌసమీ ఛటర్జీ, సుస్మితా సేన్, రాణి ముఖర్జీ, బిపాసా బసు, కొంకణా సేన్ శర్మలను... కోల్ కతా ఫిల్మ్ ఫెస్టివల్ ముగింపు సందర్భంగా సన్మానించనున్నట్లు తెలిపింది. ఈ నెల 17న జరిగే ఈ కార్యక్రమంలో 'పంచ్ కన్య' పేరుతో అవార్డును బహూకరించనున్నట్లు డైరెక్టర్ జాదవ్ మోండల్ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News