: మోడీని హతమార్చేందుకు ఐఎస్ఐ కుట్ర
గుజరాత్ ముఖ్యమంత్రి, బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీని హతమార్చేందుకు పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ కుట్రపన్నినట్లు ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబీ) పసిగట్టింది. ఖలిస్థానీ తీవ్రవాదులతో మోడీని అంతమొందించాలని ఐఎస్ఐ ప్రయత్నిస్తున్నట్లు ఐబీ హెచ్చరించడంతో కేంద్ర ప్రభుత్వం మోడీకి భద్రతను మరింత కట్టుదిట్టం చేయనుంది. దీంతో మోడీకి మూడంచెల భద్రత లభించనుంది. ఒక బృందం మోడీపై దాడికి యత్నిస్తే దీటుగా బదులిస్తుంది. మరో బృందం మోడీకి రక్షణ కవచంలా ఉంటుంది. మూడో బృందం మోడీని సురక్షితంగా తప్పిస్తుంది.