: తెలంగాణను అడ్డుకునేందుకు చంద్రబాబు ప్రయత్నం: కేటీఆర్


తెలంగాణను అడ్డుకునేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు చేయని ప్రయత్నం లేదని టీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ విమర్శించారు. సమస్యను మరో నెల రోజుల పాటు పొడిగిస్తే తెలంగాణ రాదని బాబు ఆశపడుతున్నారని ఆరోపించారు. ప్రస్తుతం రెంటికి చెడ్డ రేవడిలా ఆయన పరిస్థితి తయారయిందని... అఖిలపక్ష భేటీకి డిమాండ్ చేసిన బాబునే.. భేటీకి వెళ్లననడమేంటని కేటీఆర్ ప్రశ్నించారు. సమన్యాయం కోరుకునే వారు, ప్రజల ఆకాంక్ష పట్ల గౌరవం ఉంటే అఖిలపక్ష భేటీకి రావాలని డిమాండ్ చేశారు.

పార్టీ కార్యాలయం టీఆర్ఎస్ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన కేటీఆర్ టీడీపీపై తీవ్ర విమర్శలు చేశారు. సీమాంధ్ర నాయకులు రాష్ట్రపతికి తప్పుడు నివేదికలు ఇస్తున్నారన్నారు. కేబినెట్ నిర్ణయాన్ని పక్కనబెట్టి రాష్ట్రపతి నిర్ణయం తీసుకుంటారని ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. జగన్, చంద్రబాబు అఖిల పక్ష సమావేశానికి ఎందుకు రావడం లేదని సూటిగా అడిగారు.

  • Loading...

More Telugu News