: ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో పొగలు
హైదరాబాద్ వస్తున్న ఎస్వీఆర్ ట్రావెల్స్ బస్సులో ఒక్కసారిగా పొగలు వచ్చాయి. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ మండలం అబ్దుల్లాపూర్ మెట్ వద్ద ఈ ఉదయం జరిగింది. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ బస్సును ఆపి ప్రయాణికులను కిందకు దించేశాడు. జరిగిన ఘటనతో తొలుత ఆందోళనకు గురైన ప్రయాణికులు తర్వాత ఊపిరిపీల్చుకున్నారు.