: సచిన్.. తారలకు తార అయిన వేళ.. !
సినిమా తారలంటే సమాజంలో ఎంత క్రేజో ప్రత్యేకంగా చెప్పాల్పిన పనిలేదు. వారు ఎప్పుడన్నా ఏదైనా కార్యక్రమంలో పాల్గొనేందుకు బయటికొస్తే చాలు అభిమానులందరూ ఎగబడడడం సాధారణంగా కనిపించే దృశ్యం. అంతటి ఫాలోయింగ్ ఉన్న సినీ తారలు ఈరోజు మరో తార కోసం క్యూలు కట్టారు.
ఆ తార మరెవరో కాదు క్రికెట్ దేవుడు సచిన్. అవును, ఈరోజు ఆసీస్ తో మ్యాచ్ ముగియగానే సచిన్ హోటల్ కు చేరుకున్నాడు. ఇంకేముంది, తమ అభిమాన క్రికెటర్ ను కలిసేందుకు ఇంతకుమించిన తరుణం ఉండదనుకున్నారో ఏమో.. శ్రీకాంత్, తరుణ్, నిఖిల్ వంటి టాలీవుడ్ హీరోలు హోటల్ వద్దకు చేరుకున్నారు.
అక్కడ వారందరితో ఫొటోలు దిగిన సచిన్ వారి మోములో నవ్వులు పూయించాడు. కాగా, మన హీరోలు సీసీఎల్ లో తెలుగు వారియర్స్ సాధించిన విజయాలను సచిన్ తో ప్రస్తావించినట్టు సమాచారం.