: ఇది ఏటిఎం కాదు... ఏటిజి!
ఎటిఎం అంటే మనం మామూలుగా చెప్పుకునే అర్ధం ఎనీ టైం మనీ... అసలు అర్ధం వేరైనా మనం మాత్రం ఈ అర్ధంతోనే ఈ పదాన్ని వాడుతుంటాం. అయితే ఈ ఏటీజీ ఏంటి అనుకుంటున్నారా... ఏనీ టైం గోల్డ్. అంటే మనం కోరుకున్నప్పుడు బంగారు బిస్కెట్లను డ్రా చేసుకోవచ్చు. ఇలాంటి వెరైటీ ఏటీఎం ఎక్కడుంది? అని ఆశ్యర్యపోతున్నారా... మన దేశంలో కాదులెండి.
అబుదాబి హోటల్‌లోని ఎమిరేట్స్ ప్యాలెస్‌లో ఒక ప్రత్యేకమైన ఏటీఎం ఉంది. దీన్లోంచి డబ్బులకు బదులుగా బంగారాన్ని బిస్కెట్ల రూపంలో తీసుకోవచ్చు. అయితే ఇక్కడ డ్రా చేసుకోవడం అంటే మన అకౌంట్ నుండి డ్రా చేసుకోవడం కాదు... ఈ మిషను నుండి స్వచ్ఛమైన బంగారాన్ని కొనుక్కోవడం అన్నమాట. అంటే మనం సదరు బంగారానికి అవసరమైన డబ్బులను ఏటీఎంలో ఉంచితే దానికి సరిపడినంత బంగారు బిస్కెట్లను ఆ మిషను బయటికి పంపిస్తుందన్నమాట. ఈ మిషను ద్వారా మనం అచ్చమైన 24 క్యారెట్ల బంగారంతో తయారైన బంగారు బిస్కెట్లను కొనుక్కోవచ్చు. స్వచ్ఛమైన బంగారంతో తయారైన గోల్డ్‌బార్స్ ఈ మిషన్‌లో ఉంటాయి. 2.5, 5 నుండి 10 గ్రాముల బంగారు బిస్కెట్లను 193, 343, 638 డాలర్లకు కావలసిన వారు కొనుగోలు చేయవచ్చు.