: నిబంధనలకు లోబడే జగన్ కేసు దర్యాప్తు: సీబీఐ జేడీ
జగన్ అక్రమాస్తుల కేసును నిబంధనలకు లోబడే దర్యాప్తు చేస్తున్నామని సీబీఐ జాయింట్ డైరక్టర్ లక్ష్మీనారాయణ అన్నారు. ఇందులో ఎలాంటి ఆరోపణలకు తావులేదని ఆయన స్పష్టం చేశారు. గుంటూరులో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు.
ఇక, కేసు విచారణలో భాగంగా ఆయా రంగాల నిపుణుల సేవలు స్వీకరిస్తామని తద్వారా దర్యాప్తును ముందుకు తీసుకుపోతామని లక్ష్మీనారాయణ వివరించారు. పలు కీలకమైన కేసుల విచారణ నేపథ్యంలో తానేమీ ఒత్తిడికి గురికావడంలేదని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
తన దైనందిన కుటుంబ జీవితానికి ఇవేమీ అడ్డురావని ఆయన తెలిపారు. ఇటీవల కాలంలో సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయని చెబుతూ, విచక్షణతోనే వాటిని సమర్థంగా ఎదుర్కోవచ్చని సీబీఐ జేడీ సూచించారు.