: జీవోఎంకు లిఖిత పూర్వక నివేదికలిచ్చిన సీపీఐ, వైఎస్సార్ సీపీ
రాష్ట్ర విభజనపై ఏర్పాటైన మంత్రుల బృందానికి సీపీఐ, వైఎస్సార్ సీపీలు ఇప్పటికే లిఖితపూర్వక అభిప్రాయాలు తెలిపాయి. రాష్ట్ర విభజన ప్రయత్నం సమ్మతం కాదని జీవోఎంకు వైఎస్సార్ సీపీ స్పష్టం చేయగా, సీపీఐ అనేక సూచనలతో 5 పేజీల నివేదిక పంపింది. కాంగ్రెస్, బీజేపీ, సీపీఎం, టీఆర్ఎస్, టీడీపీ, ఎంఐఎం పార్టీలు ఇప్పటి వరకు జీవోఎంకు ఎలాంటి నివేదికలు పంపలేదు. సీపీఎం, ఎంఐఎంలు విభజనకు వ్యతిరేకమంటూ గతంలోనే స్పష్టం చేశాయి. కాగా ప్రధాన పార్టీలు కాంగ్రెస్, టీడీపీ, బీజేపీలు ఏం చెబుతాయన్నదే ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్, టీడీపీ నేతలు రెండు వర్గాలుగా విడిపోయి రెండు వాదాలు వినిపిస్తున్నారు. దీంతో రాజకీయ పార్టీల పరిస్థితి కరవ మంటే కప్పకు కోపం, విడవ మంటే పాముకు కోపంలా తయారైంది.