: నేరాన్ని ఇతర పార్టీలపైకి నెట్టి కాంగ్రెస్ బయటపడేందుకే అఖిలపక్షం: ఏబీకే ప్రసాద్
రాష్ట్ర విభజన అంశంపై కాంగ్రెస్ పార్టీ కుట్ర రాజకీయాలకు పాల్పడుతోందని సీనియర్ జర్నలిస్టు ఏబీకే ప్రసాద్ తెలిపారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ విభజన నేరాన్ని ఇతర పార్టీలపైకి నెట్టి తాను వైట్ కాలర్ గా బయట పడదామనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ అఖిలపక్ష సమావేశం అంటోందని మండిపడ్డారు. పార్లమెంటులో బిల్లు పెట్టే సమయానికి అఖిలపక్షాన్ని పిలవడం ఎందుకో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. విభజన నిర్ణయాన్ని తీసుకున్న తరువాత అఖిలపక్షంతో పనేంటని ఆయన నిలదీశారు. విభజన విషయంలో ఇతర రాజకీయ పార్టీలను దోషులుగా చిత్రీకరించేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ఆయన అన్నారు.