: ఆర్టీసీ ఛార్జీలు పెంచిన రాష్ట్ర ప్రభుత్వం
ఆర్టీసీ ఛార్జీలను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పెరిగిన ఛార్జీలు రేపు అర్ధరాత్రి నుంచి అమల్లోకి వస్తాయి. ఏసీ బస్సులపై 12 శాతం, సూపర్ లగ్జరీ బస్సులపై 10 శాతం, పల్లెవెలుగు బస్సులపై 8 శాతం ఛార్జీలు పెంచారు. విభజన నేపథ్యంలో సీమాంధ్రలో జరిగిన రెండు నెలల ఆర్టీసీ సమ్మె, పెరిగిన డీజిల్ ధరలు ఛార్జీల పెంపుకు ప్రధాన కారణమని ఆర్టీసీ ప్రకటించింది.