: రాహుల్ గాంధీకి నాలుగు రోజుల గడువిచ్చిన ఈసీ
నోటీసులపై స్పందించేందుకు రాహుల్ గాంధీకి ఎన్నికల సంఘం నాలుగు రోజుల గడువు ఇచ్చింది. రాహుల్ గాంధీ తన ఎన్నికల ప్రచార ప్రసంగాలలో ఎన్నికల నియమావళిని అతిక్రమించారని పేర్కొంటూ ఎన్నికల సంఘం నోటీసు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించడానికి కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ వారం రోజుల సమయం అడిగిన సంగతి కూడా తెలిసిందే. రాహుల్ విన్నపానికి స్పందించిన ఈసీ నాలుగు రోజుల గడువు ఇచ్చంది.