: వోల్వో బస్సు ప్రమాద మృతుల గుర్తింపు
మహబూబ్ నగర్ జిల్లా పాలెంలో కొన్ని రోజుల కిందట జరిగిన వోల్వో ప్రమాద ఘటనలో 45 మంది సజీవదహనమైన సంగతి తెలిసిందే. వారిలో డీఎన్ఏ ఆధారంగా 22 మంది మృతదేహాలను గుర్తించినట్లు జిల్లా కలెక్టర్ గిరిజా శంకర్ తెలిపారు. కొద్దిసేపట్లో మృతదేహాలను కుటుంబసభ్యులకు అప్పగించనున్నారు. అయితే, ధ్రువీకరణ పత్రాలు చూపించి మృతదేహాలు తీసుకెళ్లాలని వచ్చిన వారికి సూచించారు. గుర్తించిన వారి పేర్లు చూస్తే.. ప్రశాంత్ గుప్తా, అక్షయ్ సింగ్, ఎంఎస్ గిరిధర్, శివకిరణ్, ఫణికుమార్, బాలచందర్ రాజు, మేరి విజయకుమారి, వేదపతి, సంజయ్ సాహూ, జమాలుద్దీన్, రవి, ఎండీ సర్ధార్, వెంకటేశ్, మోసిన్ పాషా, రమ్య, అశితోష్ పాండ్, రఘువీర్, మేరి విజయకుమారి, వేదపతి పేర్లు ఉన్నాయి.